రోడ్డుపై ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని తన వాహనంలో ఆసుపత్రికి తరలించిన భూమా అఖిల ప్రియ

  • దీబగుంట్ల వద్ద ఘటన
  • రోడ్డుప్రమాదానికి గురైన మల్లికార్జున అనే వ్యక్తి
  • వీడియో పోస్టు చేసిన టీడీపీ
టీడీపీ మహిళానేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ మానవత్వానికి ప్రతీకలా నిలిచిన సంఘటన ఇవాళ చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా దీబగుంట్ల వద్ద మల్లికార్జున అనే వ్యక్తి రోడ్డప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితిలో పడివుండడాన్ని అదే మార్గంలో వెళుతున్న భూమా అఖిల ప్రియ గమనించారు. మల్లికార్జున పరిస్థితిని గమనించిన ఆమె వెంటనే తన వాహనం ఆపి, స్థానికుల సాయంతో అతడిని తన వాహనంలో చేర్చి నంద్యాల ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియోని టీడీపీ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేసింది. ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అన్న టీడీపీ సిద్ధాంత ఆచరణ ఇలాగే ఉంటుందని ట్వీట్ చేసింది.


Bhuma Akhila Priya
Dibaguntla
Mallikarjuna
Accident
Hospital
Telugudesam

More Telugu News